30,607 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేశారు.. అయినా చెక్కుచెదరలేదు!

స్మార్ట్‌ఫోన్ కింద పడితే స్క్రీన్ పగిలిపోతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. అలాంటిది ఓ మొబైల్ ఫోన్‌ను ఏకంగా 30,607 మీటర్ల ఎత్తు నుంచి భూమిపైకి పడేశారు. ఇంత ఎత్తు నుంచి కిందకు పడేసినప్పటికీ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అసాధారణ ప్రయోగంతో రైనో షీల్డ్, సేంట్ ఇన్టూ స్పేస్ సంస్థలు రికార్డు సృష్టించాయి.

ఈ ప్రయోగంలో మొబైల్ ఫోన్‌ను అత్యంత ఎత్తు నుంచి భూమిపైకి పంపించారు. భూమికి చేరుకున్న తర్వాత ఫోన్‌ను పరిశీలించగా.. అది ఎలాంటి నష్టం లేకుండా పనిచేసినట్లు వెల్లడైంది. ఫోన్‌ను రక్షించడంలో ప్రత్యేకంగా రూపొందించిన కేస్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ ఫోన్ రక్షణ సామర్థ్యాన్ని నిరూపించే వినూత్న ప్రయోగంగా ఇది నిలిచింది.

ఈ అసాధారణ ప్రయోగాన్ని గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ.. మొబైల్ ఫోన్ కేస్ విభాగంలో రైనో షీల్డ్, సేంట్ ఇన్టూ స్పేస్ సంస్థలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను అందించింది. ఏకంగా 30,607 మీటర్ల ఎత్తు నుంచి పడేసినా ఫోన్ సురక్షితంగా ఉండటంతో ఈ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share