అల్లం భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉపయోగించే పదార్థాల్లో ఒకటి. టీ, కూరలు, పప్పులు, గ్రేవీలు, వేపుడు కూరలు ఇలా ఎన్నో వంటకాల్లో అల్లం వాడుతుంటారు. ఇది వంటకు ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది. అయితే అల్లం వాడే ముందు దాని పలుచని తొక్కను తొలగించడం చాలామందికి కాస్త కష్టంగా ఉంటుంది.
అల్లం వంకరటింకర ఆకారంలో ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీసేటప్పుడు అల్లం కూడా ఎక్కువగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే స్పూన్‌తో అల్లం తొక్కను సులభంగా తొలగించవచ్చు. అల్లం ఉపరితలంపై స్పూన్ అంచుతో మెల్లగా రుద్దితే పలుచని తొక్క మాత్రమే తొలగిపోతుంది. వంకర ప్రాంతాల్లోనూ స్పూన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
అలాగే అల్లాన్ని ముందుగా కొద్దిసేపు నీటిలో నానబెట్టడం ద్వారా కూడా తొక్కను సులభంగా తొలగించవచ్చు. మరో పద్ధతిగా అల్లం ముక్కలను అవసరానికి అనుగుణంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తొక్క తీస్తే పని మరింత సులభమవుతుంది. ఇలా కత్తి లేదా పీలర్‌తో అల్లం ఎక్కువగా వృథా కాకుండా తక్కువ సమయంలో తొక్క తొలగించుకోవచ్చు.









