అనయా బంగర్‌కు మారిజానే కాప్ కౌంటర్.. ఘాటుగా స్పందించిన భారత క్రికెటర్

క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న అనయా బంగర్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానే కాప్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మహిళల క్రికెట్‌లోకి అనయాకు తిరిగి వచ్చే అవకాశం కల్పించడంపై కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ‘పూర్తిగా హాస్యాస్పదం’ అంటూ విమర్శించింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనయా.. ఈ అంశంపై మాట్లాడేవారు ముందుగా పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించింది.

మారిజానే కాప్ వ్యాఖ్యలపై అనయా బంగర్ స్పందిస్తూ.. తనకు ఎలాంటి అనుచిత ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్దేశించిన మార్గదర్శకాలను తాను పూర్తిగా పాటిస్తున్నానని తెలిపింది. తన అర్హతకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే అందుబాటులో ఉంచానని పేర్కొంది. కాబట్టి తనపై వ్యాఖ్యలు చేసే ముందు సంబంధిత నిబంధనలు, పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించింది.

ఎవరైనా ఈ విషయంలో వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటే.. ముందుగా అంశంపై మరింత అవగాహన పెంచుకోవాలని అనయా బంగర్ పేర్కొంది. క్రికెట్‌లో తనకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనలు ఏవీ లేవని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే తాను ముందుకు సాగుతున్నానని తెలిపింది. దీంతో అనయా, మారిజానే కాప్ మధ్య వ్యాఖ్యల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు