TECNO SPARK Go 3 Pro లాంచ్.. బడ్జెట్ సెగ్మెంట్‌లో IP69 రేటింగ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో టెక్నో సంస్థ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. TECNO SPARK Go 3 Pro పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లోనే IP69 రేటింగ్‌ను అందించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలిచింది. దుమ్ము, నీటి అధిక పీడన జెట్లు, అనుకోకుండా ఫోన్ కిందపడటం వంటి పరిస్థితులను తట్టుకునేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

రోజువారీ కఠినమైన వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని TECNO SPARK Go 3 Proను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఫోన్‌ను ఎక్కువగా బయట ఉపయోగించే వారికి అనువుగా దీని డిజైన్, డ్యూరబిలిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సాధారణ వినియోగంలో ఫోన్‌కు ఎదురయ్యే దుమ్ము, నీరు, అనుకోకుండా పడిపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొనేలా దీనిని రూపొందించినట్లు తెలిపింది.

డెలివరీ ఉద్యోగులు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు, బయట ఎక్కువగా తిరిగే వారు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఈ ఫోన్ ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. బడ్జెట్ ధరలోనే మెరుగైన మన్నికను అందించడమే లక్ష్యంగా TECNO SPARK Go 3 Proను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ కొత్త ఫోన్‌పై ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు