‘కేజీఎఫ్’తోనే యష్ స్టార్ కాలేదు.. ఘాటుగా స్పందించిన తల్లి పుష్ప

సినిమా హిట్ అయితే హీరోపై ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే విమర్శలు రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో యష్ స్టార్‌డమ్‌పై వస్తున్న వ్యాఖ్యలకు ఆయన తల్లి పుష్ప ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

‘కేజీఎఫ్’ సినిమాలతో యష్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలు దేశవ్యాప్తంగా యష్‌కు భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే యష్ అభిమానులు మాత్రం ఆయన స్టార్‌డమ్ కేవలం ‘కేజీఎఫ్’ తర్వాతే మొదలైందనే వాదనను అంగీకరించరు. అంతకుముందే కన్నడ చిత్ర పరిశ్రమలో యష్‌కు ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు భారీ అభిమానగణం ఉంది.

ఇదే విషయాన్ని యష్ తల్లి పుష్ప మరోసారి బలంగా ప్రస్తావించినట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ యష్‌కు దేశవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చిందేమో కానీ, అంతకుముందే ఆయన కన్నడలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం యష్ స్టార్‌డమ్‌పై జరుగుతున్న చర్చలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టాక్సిక్’ ఫలితంతో సంబంధం లేకుండా యష్ క్రేజ్‌పై అభిమానుల్లో మాత్రం ఎలాంటి ప్రభావం లేదని చెప్పొచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు