శ్రీలంకకు షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు రద్దు

శ్రీలంక క్రికెట్ అభిమానులకు షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. 2027 ప్రారంభంలో జరగాల్సిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక హక్కులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యంపై గతంలోనూ పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ పరిపాలనలో స్వతంత్రత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్న ఐసీసీ.. పరిస్థితులను పరిశీలించిన అనంతరం టోర్నమెంట్ ఆతిథ్యంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిష్టాత్మక మహిళల టోర్నీని నిర్వహించే అవకాశం శ్రీలంకకు దూరమైనట్లు సమాచారం.

అయితే మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని ఇకపై ఏ దేశంలో నిర్వహిస్తారనే విషయంపై ఐసీసీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త ఆతిథ్య దేశం ఎంపికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీలంక నుంచి ఆతిథ్య హక్కులు వెనక్కి తీసుకోవడంతో టోర్నమెంట్ షెడ్యూల్, వేదికలపై కూడా ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు