రూ.20 వేల లోపే కొత్త స్మార్ట్‌ఫోన్లు.. బోల్ట్ నుంచి రెండు మోడళ్లు లాంచ్

ప్రముఖ వేరబుల్స్ సంస్థ ఫైర్-బోల్ట్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘బోల్ట్’ (Boltt)తో బడ్జెట్ మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. రూ.20,000లోపు ధరల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని బోల్ట్ ఈవో 4జీ, బోల్ట్ ఏస్ 5జీ పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ప్రకటనలు, అనవసరమైన యాప్‌లు లేని క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఏఐ ప్రాసెసింగ్, మెరుగైన పనితీరు ఈ ఫోన్ల ప్రధాన ప్రత్యేకతలుగా కంపెనీ పేర్కొంది.

బోల్ట్ ఈవో 4జీ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అదే 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,999కు అందుబాటులో ఉంటుంది. ఇక బోల్ట్ ఏస్ 5జీ 4GB + 128GB వేరియంట్ రూ.13,999, 6GB + 128GB వేరియంట్ రూ.14,999, 8GB + 128GB వేరియంట్ రూ.15,999 ధరలకు లభించనుంది. దీంతో బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఈ రెండు మోడళ్లు మరో ఆప్షన్‌గా మారనున్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులకు తక్షణమే రూ.1,000 డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. తక్కువ ధరలో క్లీన్ సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లు, మెరుగైన పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు