ఆశ్రమ పాఠశాలలో విషాదం.. 13 ఏళ్ల విద్యార్థిని మృతి

పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పల్లూరు గ్రామానికి చెందిన తెల్లం జాహ్నవి(13) కోతులగుట్ట ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం జాహ్నవికి తలనొప్పి రావడంతో టాబ్లెట్ వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సాయంత్రానికి జాహ్నవికి తలనొప్పితో పాటు వాంతులు కూడా అయ్యాయి. పరిస్థితి విషమించడంతో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఉపాధ్యాయులు ఆమెను కూనవరం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే అప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో జాహ్నవి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక మృతికి గల అసలు కారణాలు, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేదా అనే అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు