దసరా, బతకమ్మ సంబరాల్లో అవాంఛనీయ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు…. భద్రాద్రి పోలీస్

బతుకమ్మ, దసరా పండుగ ల సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఉన్న రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్:..

 దసరా పండుగ బతుకమ్మ ఉత్సవాలలో అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లకు భద్రాచలం పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు..

భద్రాచలం పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగ లను ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా భద్రాచలం పట్టణ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఆదివారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బతుకమ్మ, దసరా పండుగ ల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే బతుకమ్మ , దసరా పండుగ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ప్రజలు అందరు కూడా పోలీస్ వారికీ సహకరించాలని ఈ సందర్బంగా భద్రాచలం ఇన్స్పెక్టర్ ఏస్. రాజు  ప్రజలకు సూచించారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు