తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు .. పలు జిల్లాలకు వాతావరణ శాఖ తెలియజేసింది. నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వికారాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, హనుమకొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని .వాతావరణ నిపుణులు సూచించారు.
Post Views: 2









