బాబర్ అజామ్‌పై బాసిత్ అలీ ఫైర్.. “కష్టాల్లో జట్టుకు ఉపయోగపడనప్పుడు ఎంత పెద్ద ప్లేయర్ అయితే ఏంటి?”

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఓటమి పాలైన పాక్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 8, 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో అతడి బ్యాటింగ్‌పై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబర్ అజామ్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. కీలకమైన, క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవలేకపోతున్నాడని విమర్శించాడు. అభిమానులు, సోషల్ మీడియాలో బాబర్‌ను గొప్ప ఆటగాడిగా భావిస్తున్నప్పటికీ.. జట్టుకు అవసరమైన సమయంలో రాణించకపోతే ఆ ప్రశంసలకు అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు.

తాజాగా ‘ది గేమ్ ప్లాన్’ కార్యక్రమంలో బాసిత్ అలీ మాట్లాడుతూ.. గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. “కష్టమైన సమయాల్లో మీరు ఏమీ చేయకపోతే ప్రయోజనం ఏంటి? అభిమానుల దృష్టిలో మీరు గొప్ప ఆటగాడై ఉండొచ్చు.. సోషల్ మీడియాలో కూడా గొప్ప ప్లేయర్‌గా కనిపించొచ్చు. కానీ జట్టుకు ఉపయోగపడనప్పుడు ఎంత పెద్ద ప్లేయర్ అయితే ఏంటి?” అంటూ బాబర్ అజామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు