ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మరో సింపుల్ రెసిపీని అభిమానులతో పంచుకున్నారు. కేవలం రెండు నిమిషాల్లో తయారు చేసుకోగల ప్రోటీన్ మచ్చా ప్రీ-వర్కౌట్ డ్రింక్ తయారీ విధానాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తరచూ తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సోహా.. ఫిట్నెస్తో పాటు ఆరోగ్యకరమైన ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు.
రోజువారీ ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఈ రెసిపీ తన దృష్టికి వచ్చిందని సోహా తెలిపారు. వ్యాయామానికి ముందు తీసుకునే ఈ డ్రింక్‌ను త్వరగా, సులభంగా తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వారికి సమయం ఆదా చేసే ఆరోగ్యకరమైన ఆప్షన్‌గా ఇది ఉపయోగపడుతుందని ఆమె సూచించారు.
సోహా అలీ ఖాన్ షేర్ చేసిన ఈ సింపుల్ ప్రీ-వర్కౌట్ రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారు తమ ఆహారంలో ప్రోటీన్‌ను సరైన మోతాదులో చేర్చుకోవడం, వ్యాయామానికి ముందు ఏ ఆహారం లేదా పానీయం తమకు సరిపోతుందో నిపుణుల సలహాతో నిర్ణయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.









