గూగుల్ తాజాగా తీసుకొచ్చిన పిక్సెల్ 11 సిరీస్‌కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవసీ, సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ GrapheneOS.. Pixel 11 సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. GrapheneOS Foundation ప్రకారం, ఈ సిరీస్‌లో తమ సెక్యూరిటీ అవసరాలకు కీలకమైన హార్డ్‌వేర్ ఫీచర్‌కు మద్దతు లేకపోవడంతో పూర్తి పోర్ట్‌ను కొనసాగించలేకపోయారు.
ప్రధానంగా ARM Memory Tagging Extension (MTE) అనే హార్డ్‌వేర్ సెక్యూరిటీ ఫీచర్ Pixel 11 సిరీస్‌లో అందుబాటులో లేదని GrapheneOS తెలిపింది. మెమరీకి సంబంధించిన కొన్ని రకాల సెక్యూరిటీ లోపాలు, దాడులను గుర్తించి అడ్డుకోవడంలో MTE కీలక పాత్ర పోషిస్తుంది. GrapheneOS కూడా తన సెక్యూరిటీ వ్యవస్థలో హార్డ్‌వేర్ మెమరీ ట్యాగింగ్‌ను డిఫాల్ట్‌గా ఉపయోగిస్తోంది.
Pixel 11 సిరీస్‌కు GrapheneOS డెవలపర్లు ఇప్పటికే పాక్షిక పోర్ట్‌ను రూపొందించినప్పటికీ, MTE హార్డ్‌వేర్ సపోర్ట్ లేకపోవడంతో దాన్ని పూర్తి చేయలేకపోయినట్లు వెల్లడించారు. అయితే Pixel 11లో ఇతర సెక్యూరిటీ ఫీచర్లు లేవని మాత్రం దీని అర్థం కాదు. Google కొత్త Tensor G6 చిప్‌తో పాటు Titan M3 సెక్యూరిటీ చిప్, పోస్ట్-క్వాంటమ్ సెక్యూర్ బూట్ వంటి భద్రతా ఫీచర్లను అందిస్తోంది.









