రాజకీయ దాడి…. సీఎం రేవంత్ ఉచ్చులో చిక్కుకున్న కేసీఆర్‌…!!

రాజకీయ దాడి…. సీఎం రేవంత్ ఉచ్చులో చిక్కుకున్న      కేసీఆర్‌…

రేవంత్ రెడ్డి రచించిన ఈ రాజకీయ ఆటను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు?

కేసీఆర్ రాజీనామా – ఆట ప్రారంభించిన రేవంత్

ఫామ్‌హౌస్‌కే పరిమితమయినా.. జీతభత్యాలు పొందుతున్నారని కేసీఆర్‌పై రేవంత్ డైరక్ట్ ఎటాక్..!

 

TODAY 9.. WEB DESK….

తెలుగుదేశం పార్టీని వీడి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా స్వంత పార్టీని నెలకొల్పి ఎన్నో ఉద్యమాలను చేసి, తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై 10 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలించి, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కెసిఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచ్చులో చిక్కుకున్నారు.. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం ఫామ్ హౌస్ కే పరిమితమైపోయిన ఆయన  అసెంబ్లీలో అడుగుపెట్టలేదు..

ప్రజా సమస్యలపై తన వాణి బాణి వినిపించలేదు. అదే ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కును తెచ్చి పెట్టింది. ఒకవేళ మళ్లీ సార్వత్రిక ఎన్నికల నాటికి జీవసత్వాలను కూడ గట్టుకొని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టినా, పదవి కోసం బయటికి వచ్చారనే విమర్శలను కాంగ్రెస్ నుంచి ఎదుర్కోక తప్పదు.

ఒకప్పుడు కేసీఆర్ ఎటు వెళ్ళినా జన సునామీ వచ్చేది.. అద్భుతమైన వాగ్దాటి శత్రువును సైతం అబ్బురపరిచే మాటల గారడి ఆయన సొంతం..

రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకొన్న కెసిఆర్ తాను పాలించిన10 ఏళ్లలో ప్రతిపక్షం ఉనికి లేకుండా ఎవరూ మాట్లాడకుండా చేసిన ఆయన పార్టీ ఓటమి చెందిన అనంతరం మౌనం వహించటానికి  వెనుక కారణం ఏమిటి అనేది ఎవరికి అర్థం కాని విషయంగా ఉంది… ఒకవేళ ఆ మౌనం వ్యూహాత్మకమైతే అది దేనికి సంకేతం అనే సందేహాలు ప్రజల మనసుల నుండి వస్తున్నాయి.

ప్రత్యర్థులపై పదునైన మాటలు మధ్య మధ్యలో హాస్యోక్తులు… పిట్ట కథలు మాటల తూటాలను పేల్చిన ఆనాటి కెసిఆర్ ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కొంత తగ్గించి ఇంటికి పరిమితం ఎందుకు అయ్యారు… ఇది రాజకీయ సన్యాసానికి సంకేతమా లేక శత్రువు అదును చూసి శక్తియుక్తులను కూడగట్టుకొని మరో తుఫానును సృష్టించటానికి ముందు ఏర్పడ్డ నిశ్శబ్దమా అనేది రాజకీయ విశ్లేషకులు సైతం కనిపెట్టలేకపోతున్నారు.

ఇది ఇలా ఉంచితే  కాలం కలిసి రానప్పుడు ఊరుకునే ఉండాలి ఎగిరెగిరి పడరాదు అనే ధోరణితో కెసిఆర్ ఉన్నారా? అయితే అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేగా జీతభత్యాలను పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలి అనే అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఏ రూపంలో ఇస్తారు? కెసిఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా,భవిష్యత్తులో ఎన్నికల వేళ కేసీఆర్ బయటకు వచ్చినా.. అది కేవలం పదవుల కోసమే వచ్చారు అనే బలమైన ముద్రను ప్రజల్లో చేరే విధంగా బలమైన  స్కెచ్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అసెంబ్లీ కి రాకపోయినా ఎమ్మెల్యేగా జీతభత్యాలు ఇతర అలవెన్సులు పొందటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేలెత్తి చూపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రస్తావన చేశారో, ఆ పిలుపును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంపై నిరసనలకు దిగింది అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తోంది.

కెసిఆర్ కు నిజంగానే ఏదైనా అనారోగ్య సమస్య ఉందా లేకపోతే పదేళ్లు పరిపాలించిన అనంతరం సీఎం కుర్చీ చేజారిపోయింది అనే వైరాగ్యం ఆవరించి ఆయన ప్రజల్లోకి రాలేకపోతున్నారా? మరింకేదైనా కారణం ఉందా ? ఒకవేళ ఆయన శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటే పార్టీ పగ్గాలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు అప్పజెపుతారా ?  … అనే ప్రశ్నలు జనాల్లో వినపడుతున్నాయి. ఈ పరిణామాలపై  బి ఆర్ ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి…

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు