Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ కు వినతిపత్రం మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు వినతి పత్రం అందజేశారు
మణుగూరు పర్యటన సందర్భంగా రాహుల్ ను శాలువాతో సత్కరించారు.పినపాక నియోజకవర్గం గిరిజన ఆదివాసి గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీడీఏ చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం నాడు మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ అద్దంకి నరేష్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీల ఎస్.ఐ.ఆర్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ గారికి అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులను, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తీరును, గిరిజన ఎగ్జిబిషన్ ఏర్పాటు, కోయ భాషకు లిపి ఆయన చేసిన కృషి తదితర అంశాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలలో గల గిరిజన ఆదివాసి గ్రామాలైన బుగ్గ, ఖమ్మం తోగు, బుడుగుల, పెద్దిపల్లి, రేగులగండి, రాయన్నపేట, కుమ్మరిగుంపు, ఇప్పలగుంపు, మనుబోతులగూడెం, వేములూరు, అశ్వాపురం గుంపు తదితర ఆదివాసి గిరిజన గ్రామాలకు రహదారి, విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలు లేక గిరిజనులు, ఆదివాసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఐ ఎఫ్ టి యు నాయకులు ఎస్.డి నాసర్ పాషా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు
ఈ కార్యక్రమంలో కూచిపూడి బాబు, గాండ్ల సురేష్, కురం రవి, బి. వరలక్ష్మి (కాంగ్రెస్), షేక్ సర్వర్, జి. వెంకటేశ్వర్లు (సీపీఐ), సాంబశివరావు, బొల్లం రాజు (సీపీఎం), లింగంపల్లి రమేష్ (బీజేపీ), పాక వెంకటేశ్వర్లు (బీఎస్ పి), కే. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









