పంజాబ్‌కు మీనాక్షి.. తెలంగాణకు వీడ్కోలు..??!

పంజాబ్‌కు మీనాక్షి.. తెలంగాణకు వీడ్కోలు..??

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి మీనాక్షీ నటరాజన్‌ తప్పుకోనున్నట్టు సమాచారం అందుతోంది.. కాగా రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణ నుంచి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలియవచ్చింది త్వరలోనే పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇది ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలపై మీనాక్షీ నటరాజన్‌ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.గతంలో తనకు రాజ్యసభ అవకాశం దక్కకుండా.. కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకున్నారన్న అసంతృప్తితో ఆమె ఉన్నట్టు సమాచారం.

తెలంగాణలో కొనసాగడం ఇష్టం లేదని రాహుల్‌గాంధీకి ఆమె స్పష్టం చేసినట్టు ప్రచారం నడుస్తుండగా,మరోవైపు పంజాబ్‌ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారిసున్న క్రమంలో,పంజాబ్‌ పరిస్థితులపై అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో పరిశీలకుల బృందాన్ని ఏ ఐ సీ సీ నియమించనుండగా, ఆ  బృందంలో మీనాక్షీ నటరాజన్‌, అజయ్‌ మాకెన్‌, భజన్‌లాల్‌ జాతవ్‌ లు ఉన్నారని పార్టీ  నుంచి  మాటలు వినవస్తున్నాయి.

అయితే ఇప్పటికే పంజాబ్‌ రాజకీయాలపై సమీక్షల్లో మీనాక్షీ నటరాజన్‌ బిజీగా ఉన్నట్టు, తెలంగాణలో ‘సర్‌’ ప్రక్రియ ముగిసిన వెంటనే పంజాబ్‌ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉండనున్నట్టు పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది…

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు