Xiaomi కొత్త మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్స్.. సెప్టెంబర్ 8న ఇండియా లాంచ్!

ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) భారత మార్కెట్‌లో తన ఛార్జింగ్ యాక్సెసరీస్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు కొత్త మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్స్‌ను భారత వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ కొత్త లైనప్‌లో ‘షియోమీ ఆల్ట్రాథిన్ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 5000 15W’, ‘షియోమీ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 10000 45W’ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు పవర్ బ్యాంక్స్‌ను సెప్టెంబర్ 8న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో షియోమీ నుంచి కొత్త ఛార్జింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఈ రెండు మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్స్ ధరలు, ఎక్కడి నుంచి కొనుగోలు చేయవచ్చు, సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ సమయంలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పవర్ బ్యాంక్స్‌తో భారత మార్కెట్‌లో తన యాక్సెసరీస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు షియోమీ ప్రయత్నిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు