‘మా రాముడు అందరివాడు’.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్!

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ సరసన స్వాతి మందాడి హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రబృందం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్, స్వాతి మందాడి జంటకు తోడు సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న ‘మా రాముడు అందరివాడు’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు