కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన లో ఒరిగింది ఏమీ లేదు….

Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట లో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR  పిలుపుతో …భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమం లో భాగంగా 3 వ రోజు మొండికుంట సెంటర్ నందు పార్టీలకు అతీతంగా రైతులకు వ్యవసాయ విధ్వంసం పై నీటి పారుదల రంగం, విద్యుత్,యూరియా రైతు భీమా జరుగుతున్న నష్టానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు ..

ఈ సందర్భంగా మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ….

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలలో ప్రధానమైనది రైతులకు మూడు పంటలకి రైతుబంధు 15000/-, పండించిన పంటకి గిట్టుబాటు ధర, సన్న వడ్లకి 500 బోనస్, కౌలు రైతుకు రైతుబంధు 15000/-, ఇస్తానని హామీ ఇచ్చినారు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నారు అన్నారు రైతు పంట పండించుకోవడానికి కనీసం యూరియా కూడా ప్రభుత్వం రైతులకు సక్రమంగా అందించలేకపోతున్నారు అని అన్నారు, రైతు కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 12,000/- ఇస్తామని అన్నారు, ఇప్పటి ఎక్కడ ఇచ్చింది లేదు అన్నారు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన హామీలను ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు అన్నారు, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బీమా లాంటి అద్భుత పథకాలను నామరూపాలు లేకుండా చేసి రైతు కుటుంబానికి అన్యాయం చేశారు అన్నారు,ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పాలనలో రైతులకు చేసిన అన్యాయాలను గుర్తుచేసి తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని రైతుల తరఫున డిమాండ్ చేశారు …అదేవిధంగా నెల్లిపాక శివారులో ఉన్నటువంటి సుమారు 1100 నుంచి 1000 ఎకరాలు 190/ నంబర్ భూములను అమ్మకం కొనుగోలు నుంచి తొలగించి మారెళ్ళ పాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మండల రైతాంగానికి  ఆయకట్టు రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు…

ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి,కంచగట్ల వీరభద్రం,మొగిళ్ల వీరారెడ్డి,చిలక వెంకటరమయ్య,తూము రాఘవులు,మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య,నెల్లిపాక సర్పంచ్ మండ్రు రామకృష్ణ,గొల్లగూడెం సర్పంచ్ కోండ్రు సోమయ్య,ఆనందపురం సర్పంచ్ ముర్రం సమ్మయ్య,కళ్యాణపురం సర్పంచ్ లకావత్ రామారావు,మండల యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ,అనందపురం ఉపసర్పంచ్ దేవన బోయిన మహేష్,మల్లెలమడుగు ఉపసర్పంచ్ గాడిద మహేష్,నాయకులు గొర్రె ముచ్చ వెంకటరమణ,బొర్రా శ్రీను,గుంపెన శ్రీను,నజీర్ సోను,కడారి వేణు,శివరకు డాక్టర్ బాబు,ఇసంపల్లి పున్నారావు,తదితరు నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,రైతులు పాల్గొన్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు