కరీనా కపూర్‌ జీవితంలో ఆ ఒక్క అసంతృప్తి.. పిల్లల విషయంలో మాత్రం కీలక నిర్ణయం!

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన అందం, అభినయం, విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న కరీనా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావాలనే కోరికతో చదువును మధ్యలోనే ఆపేశానని, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తర్వాత చదువును కొనసాగించలేకపోయానని ఆమె తెలిపారు.

సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చిన సమయంలో చదువును కొనసాగించడం కంటే నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కరీనా చెప్పారు. కొంతమంది తనను విమర్శించినప్పటికీ.. తనకు నచ్చిన రంగంలో రాణించాలనే పట్టుదలతో ముందుకు సాగానని తెలిపారు. అయితే చదువును పూర్తి చేయలేకపోయాననే అసంతృప్తి ఇప్పటికీ తనలో ఉందని కరీనా వెల్లడించారు.

తన అనుభవం కారణంగానే ఇప్పుడు తన ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్‌ చదువు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నట్లు కరీనా తెలిపారు. ముందుగా చదువును పూర్తి చేసిన తర్వాతే వారికి నచ్చిన రంగంలోకి వెళ్లాలని పిల్లలకు సూచిస్తున్నానని చెప్పారు. తాను చదువును మధ్యలోనే ఆపేశాననే బాధ తనలో ఉండటంతో.. పిల్లలు మాత్రం తమ విద్యను పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు కరీనా స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు