శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం.. ప్రయాణికులంతా సేఫ్‌

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పార్కింగ్ బేకు తరలిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన గైడెన్స్ పోల్‌ను విమానం ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

విమానం గైడెన్స్ పోల్‌ను ఢీకొట్టిన ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, విమానానికి జరిగిన నష్టం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు