కలెక్టర్ల సమావేశానికి ముందు అధికారులతో కలెక్టర్ నిశాంతి సమీక్ష.. సంక్షేమ పథకాలపై కీలక ఆదేశాలు

కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఆయా శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడంతో పాటు పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను వేగంగా పరిష్కరించి, జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు