Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సూచనల మేరకు, నూతనంగా వెలువడనున్న పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ (Free Coaching) మరియు ఉచిత వసతి (Free Residential Facility) కల్పించనున్నారు..అభ్యర్థులందరికీ ఆదివారం 6వ తేదీన శ్రీ చైతన్య పాఠశాలలో మణుగూరు సబ్ డివిజన్ అభ్యర్థులు ప్రవేశ పరీక్ష (Entrance Test) నిర్వహించనున్నారు . పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు , పరీక్షా కేంద్రం వద్ద, లేదా పోలీస్ స్టేషన్లో అందించనున్నారు .ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తూ, పోలీస్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నట్టు .
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ సదవ వకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసిందిగా మణుగూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.









