ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును విమర్శించే స్థాయి నీది కాదు..

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేసిందేమిటో ముందుగా కుర్రి నాగేశ్వరరావు సమాధానం చెప్పాలి

Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు

– మణుగూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు పీరినాకి నవీన్

మణుగూరు, సెప్టెంబర్ 7: పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిపై బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు చేసిన విమర్శలను మణుగూరు మండల&పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు పీరినాకి నవీన్, కురం రవి లు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని కమిషన్లు అంటావా నువ్వు ఎంత ని స్థాయి ఎంత సిగ్గువుండాలి కుర్రి నాగేశ్వరరావు నీకు కొంచమైనా మానవత్వం లేకుండా అన్నం పెట్టినా వాడికి సున్నం పెట్టి కమిషన్లకు కక్కుర్తిపడింది ఎవరో మండల ప్రజలకు తెలుసు అని మండిపడ్డారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ, పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రజాప్రతినిధిపై విమర్శలు చేసే ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పదేళ్ల పాలనలో మణుగూరు ప్రాంతానికి, పినపాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని పీరినాకి నవీన్ తెలిపారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు తమ గత పాలనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ నాయకులపై ఉందన్నారు. అసెంబ్లీకి సైతం సక్రమంగా హాజరు కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే కేసీఆర్‌, ఆయన పార్టీ నాయకులు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని పీరినాకి నవీన్ డిమాండ్ చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధి, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని కుర్రి నాగేశ్వరరావుకు హితవు పలికారు.

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిపై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ తరఫున తగిన రీతిలో సమాధానం చెప్పుతామణి హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు పొడుతూరి రవి, దుగ్గంపూడి ఈశ్వర్ రెడ్డి, కోర్లకుంట అప్పారావు, వాసం శెట్టి వెంకట్రావు, ఎన్ ఎస్ యు ఈశ్వర్ నందు, తమ్మిశెట్టి శ్రీను, నానాజీ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు