Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని డిఎస్పి రవీందర్ రెడ్డి హెచ్చరించారు. రోడ్డు భద్రత నిబంధన ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పువని స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలు పాటించి బాధ్యతాయంగా ఆటోలను నడపాలని సూచించారు.
మణుగూరు సబ్ డివిజన్ ఆటో డ్రైవర్లకు క్రమశిక్షణ, విధేయత, పట్ల సూచనలు ఇచ్చిన డీఎస్పీ రవీందర్ రెడ్డి. ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు సహనం పాటించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ఆటో డ్రైవర్లు ఎక్కడైనా మద్యం సేవించి, ఘర్షణలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, వారి ఆటో సీజ్ చేసి, లైసెన్స్ రద్దుచేసి, కేసులు నమోదుచేస్తాం అని డిఎస్పి రవీందర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ నాగబాబు తో పాటు, ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, అశ్వాపురం సిఐ ఎల్లయ్య, ఎస్సైలు సురేష్, వియన్ రావు, రాజేష్ లు పాల్గొన్నారు.









