Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు..
దళితులపై BRS పార్టీ వైఖరి మరోసారి బయటపడిందంటూ వ్యాఖ్య…
తక్షణమే బర్త్’రఫ్ చేసి, SC.ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర గౌరవ “శాసనసభ”
స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై, ఒక దళిత నాయకుడే అనే ఒక చులకన భావంతో BRS పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు వాడిన నీచమైన, వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తూ…. ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన వ్యాఖ్య కాదని శాసనసభ పీఠాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమేనని, తాతా మధు గారి వ్యాఖ్యలు BRS పార్టీ నీచమైన నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
BRS అధికారంలో ఉన్న పదేళ్లు,
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని
దళిత ముఖ్యమంత్రిని చేస్తానని
దళితులకు 3_ఎకరాల భూమి ఇస్తానని
దళితబంధు పేరుతో దగాచేసి
దళిత ఉప ముఖ్యమంత్రిని బర్త్’రఫ్ చేసి
ఇప్పుడు దళిత స్పీకర్ పై దూషణలు
చేయడం వంటివి చూస్తే BRS పార్టీ వైఖరి ఏంటో తేటతెల్లమవుతుందని, ఒక దళిత నాయకుడు రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్పీకర్ పీఠంపై కూర్చోవడం జీర్ణించుకోలేకపోతున్నారని, వారికున్న కుల అహంకారం ఈ వ్యాఖ్యల రూపంలో బయటకు వచ్చిందని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీర్వాదంతో స్పీకర్ అయినటువటువంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడటం తెలంగాణ సమాజం, దళితబిడ్డల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని తక్షణమే తాతా మధుని పార్టీ సభ్యత్వం, అలాగే MLC గా బర్త్ రఫ్ చేయాలని అసెంబ్లీ వేదికగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు.









