గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ 45 రోజుల వ్యవధి ఉండేది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ఇక 25 రోజుల నిబంధనే అమల్లో ఉంటుంది. ఈ మార్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కేంద్రం ఆదేశించింది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) ఈ నిబంధనను అమలు చేయనున్నాయి. రీఫిల్‌ బుకింగ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న తేడా ఇక ఉండదు.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. రీఫిల్‌ బకాయిలు కూడా గణనీయంగా తగ్గాయని చెప్పారు. దీంతో 45 రోజుల నిబంధనను సడలించినట్లు పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో డిమాండ్‌ను నియంత్రించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో ఆ పరిమితిని తొలగించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు