రాహుల్‌ గాంధీ కొత్త టీమ్‌.. యువ నాయకత్వానికి పెద్దపీట!

కాంగ్రెస్‌ పార్టీలో కొత్త, దూకుడు స్వభావం కలిగిన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు రాహుల్‌ గాంధీ కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా జాతీయ కార్యదర్శుల నియామకానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 120 మంది నాయకులను స్వయంగా ఇంటర్వ్యూ చేసి, వారి క్షేత్రస్థాయి పనితీరు, నాయకత్వ సామర్థ్యం, ప్రజల్లో చురుకుదనాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ సంస్థను మరింత బలోపేతం చేసి, యువతను పార్టీ ముందువరుసలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాతతరం నేతలకే పరిమితం కాకుండా యువ, చురుకైన, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో రాజకీయ సీనియారిటీ కంటే పనితీరు, ప్రజలతో అనుసంధానం, క్షేత్రస్థాయి అనుభవానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

కొత్త టీమ్‌ ఎంపికలో భాగంగా రాహుల్‌ గాంధీ నేరుగా అభ్యర్థులను పరిశీలిస్తుండటం కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలంగా మార్చడంతో పాటు, భవిష్యత్‌లో బలమైన యువ నాయకత్వాన్ని తయారు చేయడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాహుల్‌ గాంధీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు