స్కూల్‌కు వెళ్లిన బాలుడు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన

పొట్టి శ్రీరాములు వారి బజారులో కిరాణా షాపు నిర్వహిస్తూ నివాసం ఉంటున్న తుమ్మలపెంట సురేష్‌, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు జెట్టిన్‌ అదృశ్యమైన ఘటన ఆందోళనకు గురిచేసింది. ఉదయం తల్లి మందలించడంతో స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన జెట్టిన్‌.. చైతన్య స్కూల్‌కు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం.

అయితే కొంతసేపటి తర్వాత కుమారుడిపై అనుమానం రావడంతో తండ్రి చైతన్య టెక్నో స్కూల్‌కు వెళ్లి వివరాలు ఆరా తీశారు. జెట్టిన్‌ ఆ రోజు స్కూల్‌కు రాలేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలిపినట్లు సమాచారం. దీంతో బాలుడు ఎక్కడికి వెళ్లాడనే విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. జెట్టిన్‌ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే తల్లిదండ్రులకు లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు