డివిజన్ పరిధిలోని శక్తినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి రోడ్ నంబర్ 7, రోడ్ నంబర్ 4 ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా మంజూరైన రోడ్ నంబర్ 7 సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై స్థానికులు, జీహెచ్ఎంసీ అధికారులతో వెంకటేశ్వర్ రెడ్డి చర్చించారు. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా కాలనీవాసులకు ఇబ్బందులు కలగకుండా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా పరిశీలించిన వెంకటేశ్వర్ రెడ్డి.. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.









