‘ఎపిక్’ చిత్రం ఆనంద్ ఫిల్మోగ్రఫీలో అందమైన సినిమాగా నిలుస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా సందడి!

బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ’90s’ సిరీస్ చూసినప్పుడే ఆయనతో సినిమా చేయాలనిపించిందని, తరుణ్ భాస్కర్ తొలి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశానో ఆదిత్య మొదటి మూవీ కోసం కూడా అంతే ఆశగా చూశానన్నారు. అలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడి సినిమాలో నటించే అవకాశం ఆనంద్‌కు రావడం అదృష్టమని, కథల ఎంపికలో ఆనంద్ పరిపక్వత చూస్తుంటే గర్వంగా ఉందని కొనియాడారు. ఈ సినిమా ఆనంద్ సినీ కెరీర్‌లో ఒక అందమైన చిత్రంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం ఆనంద్ నటనలోని సహజత్వాన్ని, ఆదిత్య రచనలోని పరిపక్వతను ప్రశంసించారు.

ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని నెగెటివ్ కామెంట్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ.. ఈ చిత్రంలో ఎలాంటి అశ్లీలత ఉండదని, యువతీయువకుల మధ్య ప్రేమకథను నిజ జీవితానికి అద్దం పట్టేలా స్వచ్ఛంగా తెరకెక్కించామని, కుటుంబ సమేతంగా హాయిగా చూసే సినిమా ఇదని తేల్చిచెప్పారు. రక్తపాతాలు, ఊహించని ట్విస్టులు లేకుండా ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకేలా ఈ సినిమా సాగుతుందని హీరో ఆనంద్ దేవరకొండ స్పష్టం చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుండగా, సెప్టెంబర్ 10 నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు