తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన… ఉప సర్పంచ్ & కాంగ్రెస్ పార్టీ నాయకులు…
Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, అణిచివేత, వెట్టిచాకిరిలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి కీర్తిశేషులు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా మణుగూరు మండలం, హనుమాన్ జంక్షన్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి వారిని స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు.
సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కురం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి వెంకన్న, AM చారి, భాగం రవి, వాసంశెట్టి వెంకట్రావు, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు పోడుతూరి రవి, నానాజీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకురాలు షబానా తదితరులు పాల్గొన్నారు.









