తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోంది… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బి ఆర్ ఎస్ నేత జి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించి చీకటి రోజులు నడుస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు, మహిళా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీకి వెళ్తున్న మమ్మల్ని రాష్ట్ర పోలీసులే అడ్డగించి దాడి చేసి, మా మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తమ పార్టీ  అధినేత కేసీఆర్ ఇంటి మీదకు దాడి చేయడానికి రేవంత్ రెడ్డే పోలీస్ ఎస్కార్ట్‌ను ఇచ్చి వేలాది మంది గూండాలను పంపించారని అన్నారు జగదీశ్ రెడ్డి.

ఇది ఇలా ఉంటే తమ పార్టీకి చెందిన  మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి,AI జనరేటెడ్ ఫోటోలను చేసి   తిరిగి వారి మీదనే 4 కేసులు  పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.వీటన్నిటికీ సంబంధించి మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చామని వివరించారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

 

 

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు