కేసీఆర్ అధ్యక్షతన త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎమ్మెల్యేగా శాసనసభకు రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజాధనాన్ని జీతం గా తీసుకుంటున్నారని, ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష నేతను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమనే డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రే స్వయంగా కేసిఆర్ పై విమర్శలు ఎక్కువ పెట్టిన నేపథ్యంలో కెసిఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నారనే సమాచారంతో రాజకీయంగా ఉత్కంఠత నెలకొంది…
ఇలా ఉంటే ఈ భేటీలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. రాష్ట్రంలో ముఖ్యంగా,సాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పాటు వర్తమాన రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణను బీఆర్ఎస్ రూపొందించనుంది…. ఏది ఏమైనా తమ పార్టీ అధినేత కొంతకాలం విరామం అనంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రానుండటంతో పాటు పార్టీ కార్యకలాపాలలో పాల్గొననున్నారనే సంకేతాలు అందటంతో పార్టీ వర్గాల్లో జోష్ వచ్చింది.
Post Views: 20









