కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసుపై ఆయన భార్య డాక్టర్ మనీషా స్పందించారు. ఉన్నత విద్యావంతుడైన తన భర్త ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.20 రోజులుగా పోలీసులు మా కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు చేశారు.
కాగా మానసిక క్షోభను భరించలేక తన మామ 60 ఆల్ఫాజోలం టాబ్లెట్లను వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలియజేశారు.
ఇది ఇలా ఉంటే, సుమంత్ ఐఐఎంలో చదువుకున్నాడని .. కొండా సురేఖ, మురళీలతో ఉన్న అనుబంధంతో ఓఎస్డీగా చేరాడని, ఓఎస్డీగా చేరిన కొన్ని రోజులకే రాజకీయ, వ్యక్తిగత కారణాలతో అతన్ని సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే,సుమంత్‌పై చేసిన ఫిర్యాదులో అతను రూ.10 కోట్లు అడిగినట్లు లేదన్నారు మనీషా.కేసులే లేనప్పుడు సుమంత్‌ను ఎందుకు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు? అంటూ ప్రశ్నించారు – సుమంత్ భార్య మనీషా.









