గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సీఐ నాగబాబు సమావేశం….

గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సీఐ నాగబాబు సమావేశం…
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరు మండలంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో పోలీస్ స్టేషన్లో సీఐ నాగబాబు సమావేశం నిర్వహించారు, ఉత్సవాలను ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. భద్రతా చర్యలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మణుగూరు పట్టణంలో గణేష్ ఉత్సవాల సందడి ఏర్పాట్లు జోరందుకున్నాయి, ఉత్సవాలకు ముందుగానే గణేష్ నిర్వాహకులు మండపాల ఏర్పాట్లను ప్రారంభించారు, వివిధ ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేస్తూ, విద్యుత్ దీపాలు, అలంకరణ పనులు చేపడుతున్నారు. గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సమావేశంలో సీఐ నాగబాబు మాట్లాడుతూ గణపతి ఉత్సవాల్లో తప్పు చేస్తే సహించేది లేదు, ఘర్షణలు ఏర్పడితే చర్యలు తప్పవు, ఏదైనా జరిగితే కమిటీ సభ్యులు దే బాధ్యత అని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలు నిర్వహించే కమిటీ వారు ముందుగా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్సైలు నగేష్ కుమార్, రవూఫ్ లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు