Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి బి.సి.ల ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయిందని , జాతీయ అధ్యక్షులు జాజుల శీనన్న పిలుపుమేరకు కులక చర్ల శ్రీనివాసు ముదిరాజ్ ఆదేశాలతో, జిల్లాలో ఈ దీక్ష చేపట్టడం జరిగిందని , బీసీ సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటు జనగణలలో భాగంగా, జన గణనతో పాటు కుల గణన కూడా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీ.సీ కులానికి జనాభా నిష్పత్తి ప్రకారం ఒక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ కోడ్ ప్రకారం బీసీల లెక్క పూర్తిగా తేలుతుందని అభిప్రాయపడ్డారు ,
ఆ లెక్క ప్రకారం బీ.సీలకు రావలసిన రిజర్వేషన్ల కోటా వస్తుందని, ఆ రిజర్వేషన్ల వలన బీ.సీ బిడ్డలకు చదువు, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా బీ.సీలకు దక్కుతాయని, దానిలో భాగంగానే ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష జిల్లాల పరంగా చేయడం జరిగినదని తెలియజేశారు.
. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దీక్షను జిల్లా అధ్యక్షులు పామర్తి ప్రసాద్ అకివీడు, రెండు జిల్లాల ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి, బుర్ర సోమేశ్వర్ గౌడ్ అధీనంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడగాని శ్రీనివాస్ యాదవ్, మాద శ్రీరాములు, భద్రాచలం బీసీ సంఘం నాయకులు శ్రీ బొలిశెట్టి రంగారావు, మల్లెల రామనాథం,శంకర్ ఎస్సీ సెల్ నాయకులు, మరియు మహిళా నాయకురాలు బాచెట్టి కవిత, బత్తుల సుజాత, భోగా లక్ష్మి, రాయల పద్మ, విజయలక్ష్మి, రాజేశ్వరి, ఎస్సీ జాను తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు …









