పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శివ నాయక్

•పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత… అందుకోసం మట్టి గణపతి ప్రతిమలను పూజకు వినియోగించండి.. జ్యూడిషల్ మ్యాజిస్ట్రేట్ ఆ ఫస్ట్ క్లాస్ శివ నాయక్…
• భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ..
భద్రాచలం, సెప్టెంబర్ 13: TODAY 9…
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, హైకోర్టు అడ్వకేట్  పి.వి. కృష్ణమాచారి  సహకారంతో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
భద్రాచలంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  శివనాయక్ ఈ  కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ శివనాయక్  మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మట్టి గణపతి ప్రతిమలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలు నీటిలో సులభంగా కలిసిపోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు .
పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, అయితే వాటిని నిర్వహించే సమయంలో ప్రకృతి పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు మరియు ప్రజలు పర్యావరణహితమైన పద్ధతులను పాటించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
భక్తి భావనకు ఎలాంటి లోటు లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా “పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత” అనే సందేశాన్ని సమాజానికి అందించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  కొడాలి శ్రీనివాసన్, జనరల్ సెక్రటరీ  పూసాల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయవాదులు హాజరై మట్టి గణపతి ప్రతిమలను స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి గణపతి ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలను ప్రతి ఒక్కరూ వినియోగించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా భక్తి, సంప్రదాయం మరియు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ వినాయక చవితిని జరుపుకోవాలనే సందేశం ప్రజలకు అందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాసన్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, సీనియర్ న్యాయవాదులు పేరాల వెంకటేశ్వర్లు, కే అరుణ , పేరాల నాగరాజు, పోకల మోహన్ కృష్ణ, పామరాజు తిరుమలరావు, సున్నం రమేష్, ఎం సంధ్యారాణి, అలాంటి ప్రవీణ్ కుమార్, రాజేష్, కొత్తపల్లి రాంబాబు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు