ఎండిపోయిన పైరు.. ఎగబాకిన అప్పులు: ‘రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి’ అంటూ మహిళా రైతు వినూత్న వేడుకోలు..

  • ఎండిపోయిన పైరు.. ఎగబాకిన అప్పులు: ‘రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి’ అంటూ మహిళా రైతు వినూత్న నిరసన చేపట్టారు.వివరాల్లోకి వెళితే…

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో ఓ మహిళా రైతు ఆవేదన గుండెలను పిండేస్తోంది. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతు, తీవ్ర వర్షాభావం మరియు కాలువల ద్వారా సాగునీరు విడుదల కాకపోవడంతో తన పంట కళ్లముందే ఎండిపోవడం చూసి కలచివేతకు గురయ్యారు.
ఈ ఏడాది అప్పులు చేసి పంట సాగు చేశానని, వర్షాలు లేక పొలం పూర్తిగా ఎండిపోయిందని లక్ష్మి వాపోయారు. పంట చేతికి రాకపోవడంతో బ్యాంకులు, బయట చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

 

కాగా సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె తన ఎండిపోయిన పొలంలోనే “రేవంత్ అన్నా.. మా రైతులను ఆదుకోండి” అని రాసి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమలాంటి రైతుల పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు