మసూద్‌ను పట్టించినవారికి రూ.70 లక్షల నజరానా ప్రకటించిన పాక్‌

మసూద్‌ను పట్టించినవారికి రూ.70 లక్షల నజరానా ప్రకటించిన పాక్‌
`

Sept 16`….

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌ ఉగ్ర ముఠా నాయకుడు మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్‌ పదే పదే చెబుతున్నా.. ఇస్లామాబాద్‌ మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. అతడు పాక్‌లో లేడని ప్రపంచాన్ని నమ్మించేందుకు తాజాగా మరో ప్రకటన చేసింది. ఆ దేశ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) తన ‘మోస్ట్‌ వాంటెడ్‌’ ఉగ్రవాదుల ‘రెడ్‌ బుక్‌’లో మసూద్‌ పేరును చేర్చింది. అతడి ఆచూకీ తెలిపినవారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల రివార్డు ప్రకటించింది.
అక్టోబరులో జరగనున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సర్వసభ్య సమావేశానికి ముందు పాకిస్థాన్‌ ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం. ఉగ్రవాదులపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాల్లో కలిగించి, అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి తప్పించుకొనేందుకే ఆ దేశం ఈ ‘గిమ్మిక్కులు’ చేస్తోందని భారత్‌ కొట్టిపారేసింది. ఇలాంటి ఎత్తుగడలు వేయడం, మోసపూరిత చర్యలకు పాల్పడటం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు