నిజామాబాద్‌లో దారుణం: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నడిరోడ్డుపై దారుణ హత్య.. సీసీటీవీ దృశ్యాలు వైరల్!

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో ప్రముఖ యూట్యూబర్ దివంగత వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక ఆర్‌ఆర్‌ చౌరస్తా పరిధిలోని రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చి హరిబాబును అడ్డగించాడు. అనంతరం క్షణాల వ్యవధిలోనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

గతంలో అదనపు కట్నం వేధింపుల నేపథ్యంలో నాలుగు నెలల గర్భిణిగా ఉన్న యూట్యూబర్ వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో భర్త హరిబాబుపై తీవ్ర ఆరోపణలు వచ్చి అప్పట్లో సంచలనంగా మారాయి. వైష్ణవి మృతి కేసు నేపథ్యమే ఈ హత్యకు కారణమా? లేక పాత కక్షలతో ఎవరైనా పథకం ప్రకారం ప్రతీకారం తీర్చుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘాతుకానికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. కారులో వచ్చి హరిబాబుపై వేగంగా దాడి చేసి పరారైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలో పట్టపగలే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు