పోలీస్ ఉద్యోగాల్లో గిరిజనులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలి….

 

Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసీ, గిరిజన నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, వెడ్మ బొజ్జు, రాందాస్ నాయక్‌లు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
ఈ మేరకు సీఎంకు లేఖ అందజేశారు, 2026 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు 75% రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల గిరిజన యువతకు నష్టం జరుగుతోందని వారు పేర్కొన్నారు. G.O.Ms.No.109, Gazette Notification No.49లోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత నియామకాల్లోనూ 75% రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు