Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరులో బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు, ఎస్టీ కోయ, లంబాడీ వర్గాల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినందుకు పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు రేగా తెలిపారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 18









