ఎర్రవల్లి ఎస్సీ రైతులకు సర్కార్ షాక్ ఇచ్చింది. రైతుల భూములకు నోటీసులు జారీ చేసింది.ఎర్రవల్లి 325 సర్వే నంబర్లోని 388.05 ఎకరాలపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.మూడు రోజులుగా భూముల హద్దులు, రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు,తొలి విడతలో 120 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా రెండు రోజుల్లో భూములకు సంబంధించిన ఆధారాలతో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.అయితే దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు ఇప్పుడు హక్కులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన 388 ఎకరాల భూముల వ్యవహారమే తాజా వివాదానికి కారణమని ఎర్రవల్లి రైతులు అభిప్రాయ పడుతున్నారు .తమ భూములను ఇతరులకు పంచుతారేమోనని స్థానిక దళిత రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.1980లో తమ కుటుంబాలకు కేటాయించిన అసైన్డ్ భూములనే ఇప్పటికీ సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు.
Post Views: 18









