కేసీఆర్, రేవంత్ ఇద్దరూ నయా నిజాంలే : రఘునందన్ రావు..

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ నయా నిజాంలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నాటకాలాడారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి నిజాం పాలనను పొగిడారని ఆరోపిస్తూ ఇద్దరి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

 

 

ఇది ఇలా ఉంటే నిజాం పాలనను ప్రస్తావిస్తూ కేసీఆర్, రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ పోలో, కొమురం భీమ్, రాంజీ గోండు పోరాటాలను గుర్తుచేస్తూ.. ఇద్దరూ ఎంఐఎంకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

 

 

భూముల పరిశీలనకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో వెళ్లడాన్ని తప్పుబట్టారు. దానం నాగేందర్‌కు ఉప ఎన్నిక కలిసిరాదని, ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు