22A అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది.ఈ క్రమంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజుకు NHRC నోటీసులు జారీ చేసింది.తక్షణమే విచారణ చేపట్టి.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
22అ గంగాల గోళం పై హైదరాబాద్కు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని.. ఈ మేరకు NHRC చర్యలకు ఉపక్రమించింది..22Aలో అమాయక ప్రజల ఆస్తులను చేర్చడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

కాగా ప్రభుత్వం, అధికారులు తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారని NHRC దృష్టికి న్యాయవాది తీసుకువెళ్లారు. అయితే ఈ ఫిర్యాదు పై NHRC స్పందిస్తూ,అమాయక ప్రజల భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచడం వారి మానవ హక్కులకు భంగం కలిగించడమేననే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది…









