12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు…
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై హైదరాబాద్ NIMS అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్కు సంబంధించిన ప్రాంతాల్లో తెలంగాణ ACB అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు.
మూసాపేటలోని కల్పతరు రెసిడెన్సీలో ఉన్న ఆయన నివాసంతో పాటు మూడు జిల్లాల పరిధిలో ఆయనకు సంబంధించిన మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై NIMS అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్కు చెందిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
మూడు జిల్లాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్తి పత్రాలు, కీలక రికార్డులను ACB పరిశీలిస్తోంది.
కాగా ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన Disproportionate Assets (DA) కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. NIMSకు సంబంధించి ACB సోదాలు జరగడం ఇదే తొలిసారిగా రిపోర్ట్ అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది…









