ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల బరిలో అలవాల రాజా మాదిగ…

సేవ చేస్తా అవకాశం ఇవ్వండి..
 భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని మరింత బలోపేతం చేస్తా…
 నిష్పక్షపాత సేవలకై ఓటుతో సహకరించండి…. అలవాల రాజా..
సామాజిక ఉద్యమకారులు,  అనేక సేవలు అందించిన  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో ఆయన ఆలోచనా విధానంతో పయనిస్తున్న అలవాల రాజా మాదిగ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల బరిలో నిలబడ్డారు …
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ఆధిపత్య అగ్ర కులాలు మాత్రమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో ఉంటూ సేవల పేరు మీద ఏమి చేస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు . పేపర్లో ఫోజులకు, సేవ ముసుగులో వాళ్ళు చేస్తున్న దోపిడిని అరికట్టాలాని, నిస్వార్ధమైన సేవను చేసేందుకు సామాజిక సేవ లక్ష్యంగా అడుగులు వేస్తూ మహనీయుల బాటలో పయనిస్తూ, పేదలకు అండగా ఉంటూ వస్తున్న తనకు ఇవ్వవలసిందిగా కోరారు….
ఇది ఇలా ఉండగా పేదలకు మరింత సేవ చేసే అవకాశం కోసం రాజకీయ ప్రోబల్యం లేకుండా , కులమతాలకు అతీతంగా  మందకృష్ణ మాదిగ  సేవా మార్గంలో మరింత సేవ చేస్తానని తెలియజేశారు .ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులు తనకు  ఓటు వేసి గెలుపుకు సహకరించ వలసిందిగా కోరారు …..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు