ఖమ్మంలో తీవ్ర విషాదం: తొమ్మిది నెలల పసికందును బలితీసుకున్న ఎర్తింగ్ లీకేజీ!

ఖమ్మంలో తీవ్ర విషాదకర సంఘటన నెలకొంది :ఎర్తింగ్ లీకేజీ వల్ల  తొమ్మిది నెలల పసికందు బలయ్యాడు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామంలో గురువారం సాయంత్రం గుండెలను పిండేసే దారుణం జరిగింది.

ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన ఇల్లెందుల రమేష్ – మమత దంపతుల తొమ్మిది నెలల పసిబాలుడు అవేద్ ఇంటి ఆవరణలో  ఆడుకుంటూ ఉండగా,అక్కడ ఎర్తింగ్ పైపుపై అమర్చిన స్టీల్ సింక్/ప్లేట్ మూతకు వర్షం కారణంగా కరెంట్ షాక్  ఏర్పడింది, కాగా ఆ పసికందు , దాన్ని పట్టుకోవడంతో అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు.

 

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు