భద్రాచలం నుంచి పోలవరం, ధవళేశ్వరం SAC
బ్యారేజీ వరకు పెరుగుతున్న ప్రవాహం!…
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 40 అడుగులు దాటగా, వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులు దాటింది. ఈ భారీ జలప్రవాహం దిగువకు కదులుతుండటంతో పోలవరం వద్ద కూడా ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ (SAC) బ్యారేజీ వద్ద ఇప్పటికే ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం వరకు గోదావరి వరద ఉధృతి స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా నిన్న శనివారం మధ్యాహ్నం 1 గంటకు భద్రాచలం వద్ద నీటిమట్టం 23.60 అడుగులు, ప్రవాహం 2,59,558 క్యూసెక్కులు ఉండగా… రాత్రి 10 గంటలకు నీటిమట్టం 33.70 అడుగులకు, ప్రవాహం 5,57,960 క్యూసెక్కులకు చేరింది. అయితే ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు నీటిమట్టం 39.20 అడుగులు, ప్రవాహం 7,70,196 క్యూసెక్కులు నమోదు కాగా… ఉదయం 7 గంటలకు నీటిమట్టం 40.40 అడుగులకు, ప్రవాహం 8,19,285 క్యూసెక్కులకు చేరింది…
దిగువ గోదావరిలోనూ పెరుగుతున్న ప్రవాహం….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం కూనవరం వద్ద నీటిమట్టం 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్లు నమోదైంది.
పోలవరం MEIL_Group వద్ద సెప్టెంబర్ 26 ఉదయం 9 గంటలకు 5,37,538 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 27వ తేదీ అర్ధరాత్రికి 5,49,165 క్యూసెక్కులకు, ఉదయం 6 గంటలకు 5,78,087 క్యూసెక్కులకు పెరిగింది.ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ (SAC) బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
ఇది ఇలా ఉంటే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం గోదావరి వరద ప్రవాహం 8–9 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది. అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవల కోసం NDRF, SDRF బృందాలను అందుబాటులో ఉంచారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని, నదిలో స్నానం, ఈత, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ సీజన్లో గోదావరిలో ఇది మూడో వరద స్పెల్. అని భద్రాచలం వద్ద పెరిగిన భారీ ప్రవాహం దిగువకు కదులుతున్న నేపథ్యంలో కూనవరం –పోలవరం–ధవళేశ్వరం SAC బ్యారేజీ వరకు వచ్చే గంటల్లో నమోదయ్యే ప్రవాహ గణాంకాలు కీలకం కానున్నాయి
Post Views: 14









